Chhattisgarh : గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు

ఛత్తీస్‌గఢ్‌లో 9 ఏళ్ల బాలిక 5 గంటలపాటు నిరంతరాయంగా నీటిలో ఈది గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. దుర్గ్ జిల్లా పురఈ అనే గ్రామం క్రీడలకు ప్రసిద్ధి చెందింది. ఆ గ్రామానికి చెందిన తనుశ్రీ కోసరే (9) ఈతపై ఆసక్తితో శిక్షణ తీసుకుంది. రోజూ 7 నుంచి 8 గంటలపాటు సాధన చేసేది. ఆదివారం ఐదు గంటల పాటు ఏకబిగిన చెరువులో ఈది గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 12 గంటలపాటు నిరంతరాయంగా ఈదడమే తన లక్ష్యమని చెప్పింది.