Bigg boss season 7 – ‘2.ఓ’ షురూ..

‘బిగ్‌బాస్ సీజన్-7’ , ‘ఉల్టా పుల్టా’ అంటూ దాదాపు ఐదు వారాల కిందట మొదలైన ఈ సీజన్లో మరో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఈ ఐదు వారాల్లో ఐదుగురు మహిళా కంటెస్టెంట్లను బయటకు పంపిన బిగ్‌బాస్ ఈ ఆదివారం శుభశ్రీ, గౌతమ్ కృష్ణల డబుల్ ఎలిమినేషన్‌తో షాకిచ్చాడు. ఆ కాసేపటికే గౌతమ్ కృష్ణను సీక్రెట్ రూమ్‌ను పంపి, మరో ట్విస్ట్ ఇచ్చాడు. అంతేకాదు, సీజన్-7 ‘2.ఓ’ షురూ చేశాడు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా ఐదుగురు కంటెస్టెంట్లను వైల్డ్ కార్డ్ ఎంట్రీ (wild card entry contestants) ద్వారా హౌస్‌లోకి పంపాడు.
అంబటి అర్జున్ (Ambati Arjun), అశ్వినీ శ్రీ (Ashwini Sri), భోలే షావలి (Bhole Savali), పూజా మూర్తి (Pooja Murthy), నయని పావని (Nayani Pavani)లు హౌస్‌లోకి అడుగు పెట్టారు. ఈ వీకెండ్ ఎపిసోడ్‌కి ‘చిన్నా’ ప్రమోషన్స్‌లో భాగంగా సిద్ధార్థ్ వచ్చి హౌస్‌మేట్స్‌తో పాటలు పాడి, డ్యాన్స్ చేయించారు. ఇక ‘టైగర్ నాగేశ్వరరావు’ ప్రమోషన్స్‌లో భాగంగా ఆ సినిమా హీరోయిన్స్‌తో కలిసి రవితేజ వచ్చి బిగ్‌బాస్ వేదికపై సందడి చేశారు.