Chennuru – మంత్రి హరీశ్ రావు పర్యటించారు

చెన్నూరు: తెలంగాణలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ డకౌట్ అవుతుందని, కాంగ్రెస్ రనౌట్,, కేసీఆర్ సిక్స్ కొడతారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. చెన్నూరులో మంత్రి హరీశ్ రావు పర్యటించారు. రూ.55 కోట్లతో నిర్మించిన 50 పడకల ఆసుపత్రిని ఆయన ప్రారంభించారు. ఎన్ని జిమ్మిక్కులు చేసినా సెంచరీ కొట్టేది కేసీఆర్ అని ఈ సందర్భంగా హరీశ్ రావు విశ్వాసం వ్యక్తం చేశారు. జేపీ నడ్డా.. తెలంగాణ కేసీఆర్ తోడయ్యారు. బీజేపీ వేసిన అడ్మిషన్ల కమిటీ అట్టర్ ఫ్లాఫ్ అని హరీశ్ రావు అన్నారు.