Texas, USA – హ్యూస్టన్‌లో గాంధీ మ్యూజియం

మహాత్మాగాంధీ జీవిత చరిత్రను తెలియజేయడంతో పాటు ఆయన అనుసరించిన అహింసా సిద్ధాంతానికి ప్రచారం కల్పించేలా అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం హ్యూస్టన్ నగరంలో గాంధీ మ్యూజియం అందుబాటులోకి వచ్చింది. ఇతర భవనాలకు అనుబంధంగా కాకుండా ఉత్తర అమెరికా ఖండంలో విడిగా గాంధీ మ్యూజియం ఏర్పాటుకావడం ఇదే తొలిసారి. దాని విస్తీర్ణం 13 వేల చదరపు అడుగులు. ‘ఎటర్నల్ గాంధీ మ్యూజియం’గా పిలుస్తున్న ఈ మ్యూజియంలోకి వాస్తవానికి ఈ ఏడాది ఆగస్టు 15 నుంచే సందర్శకులను అనుమతిస్తున్నారు. అధికారికంగా దాని ప్రారంభోత్సవాన్ని మాత్రం ఈ నెల 2న నిర్వహించారు. అర్ధ చంద్రాకృతిలోని ఈ మ్యూజియం బాహ్య గోడలపై మహాత్మాగాంధీతో పాటు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, నెల్సన్ మండేలా, బెట్టీ విలియమ్స్ తదితరుల చిత్రాలను పొందుపరిచారు.