#District News

CBN – మద్దతుగా సైకిల్ యాత్ర

రఘునాథపల్లి:చంద్రబాబు నాయుడు నిర్బంధానికి నిరసనగా, ఆయనకు మద్దతుగా శుక్రవారం రఘునాథపల్లి నుంచి రాజమండ్రి వరకు చేపట్టిన సైకిల్ యాత్రలో టీడీపీ రాష్ట్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శి ఎస్‌కే రాజు బృందం పాల్గొన్నారు. మండల అధ్యక్షుడు బొక్కా చంద్రబాబు, రాష్ట్ర కార్యదర్శి ఎడ్ల మల్లేష్, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఉమ్మగోని నారయ్య జెండా ఊపి ప్రారంభించారు. అక్రమాస్తుల ప్రమేయం లేకుండా ప్రజలకు సేవ చేస్తుంటే చిన్నపాటి రాజకీయ ఉద్దేశాలతో ఏపీ ప్రభుత్వం ఆయనను అక్రమంగా నిర్బంధించడం తగదని ఎస్కే రాజు అన్నారు. ఆ ప్రభుత్వ భయంకరమైన భావజాలాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయడమే సైకిల్ యాత్ర ఉద్దేశమని తెలియజేశారు. యాత్ర బృందం సభ్యులు మహ్మద్ జహంగీర్, మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడు కడకంచి నవీన్, రాపాక జస్వంత్, ఎం.రవి, నాయకులు అడ్డూరి శ్రీనివాస్, బైరగోని బాలయ్య, ఈర్యానాయక్ మరియు పెన్నింటి మల్లారెడ్డి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *