#National News

Snake – హెల్మెట్‌లో దూరిన ఘటన

బైక్‌పై లాక్‌ చేసి ఉంచిన హెల్మెట్‌లోకి నాగుపాము(Snake hides inside helmet) దూరిన ఘటన కేరళలోని త్రిస్సూర్‌లో ఈ ఘటన జరిగింది. పుతూర్‌లో నివాసం ఉండే పొంటెకాల్‌ సోజన్‌.. తాను పని చేసే చోట బైక్‌ను పార్క్‌ చేసి, దానికి హెల్మెట్‌ను లాక్‌ చేసి ఉంచాడు. బుధవారం సాయంత్రం 4 గంటల సమయంలో బైక్‌ను తీసేందుకు ప్రయత్నించాడు. ముందుగా హెల్మెట్‌ను తీస్తుండగా, ఏదో కదులుతున్నట్లు అనిపించేసరికి పరిశీలించి చూస్తే లోపల చిన్న పాము కనిపించింది. హడలిపోయిన అతడు హెల్మెట్‌ను దూరంగా పెట్టి.. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చాడు. ఆ శాఖకు చెందిన ఓ వలంటీర్‌ అక్కడకు వచ్చి హెల్మెట్‌లోంచి పామును జాగ్రత్తగా బయటకు తీశాడు. రెండు నెలల వయసు ఉండే ఆ పామును సంచిలో వేసి తీసుకెళ్లాడు. దీంతో తనకు ప్రాణాపాయం తప్పిందని సోజన్‌ ఊపిరి పీల్చుకున్నాడు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *