Congress led dharna-నియోజకవర్గంలో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం….

నియోజక వర్గంలో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలు, నిర్మించిన ఇళ్ల మంజూరులో జాప్యాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
పెద్దపల్లి:
నియోజక వర్గంలో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం, నిర్మించిన ఇళ్ల కేటాయింపులో జాప్యాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే విజయరామరాజు మాట్లాడుతూ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి నిర్లక్ష్యం వల్ల జిల్లా కేంద్రంలో ఇళ్ల కేటాయింపు జరగడం లేదన్నారు. నిర్మాణ జాప్యానికి అధికారులే బాధ్యత వహించాలన్నారు. అనంతరం ఆర్డీఓ మధుమోహన్‌కు వినతిపత్రం అందజేశారు. పెద్ద సంఖ్యలో మహిళలు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు, ఇతర కాంగ్రెస్ నాయకులను అనుసరించారు.