Bhagat Singh was a rare patriot-భగత్ సింగ్ అరుదైన దేశభక్తుడు

భగత్ సింగ్ అరుదైన దేశభక్తుడు అని కేంద్ర సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే అభివర్ణించారు.
ఢిల్లీ:భగత్ సింగ్ అరుదైన దేశభక్తుడు అని కేంద్ర సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే అభివర్ణించారు. భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు. భగత్ సింగ్ 116వ జయంతి సందర్భంగా శుక్రవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాజ్ త్రిపాఠి, రాహుల్ ఇంక్విలాబ్ రచించిన ‘క్రాంతి కి ధరోహర్’ (హిందీ) పుస్తకాన్ని కేంద్రమంత్రి ఆవిష్కరించారు. ఈ సమావేశంలో సాంబశివ మఠం నాయకుడు ఆనంద్ స్వరూప్ మహరాజ్ మాట్లాడుతూ.. బలమైన భారతదేశం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. సభకు సేవ్ టెంపుల్స్ ఇండియా అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో రవి అయ్యగారి, జివి మురళి, భగత్‌సింగ్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.