Janasena party – స్టంట్‌మ్యాన్ శ్రీబద్రి జనసేన పార్టీకి విరాళం

తెలుగు, తమిళ చిత్రాల్లో ఎన్నో ప్రమాదకరమైన స్టంట్స్‌ను అలవోకగా చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు స్టంట్‌మ్యాన్ శ్రీబద్రి. చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా మెహర్ రమేశ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘భోళా శంకర్’. ఇందులో ఓ కారును నడుపుతూ ఆయన చేసిన స్టంట్‌కు ప్రశంసలు దక్కాయి. ఆ స్టంట్ చేసినందుకుగానూ శ్రీబద్రి (stuntman sri badri) రూ.50వేల పారితోషికం అందుకున్నారు. తాజాగా ఆ మొత్తాన్ని జనసేన పార్టీకి (janasena party)విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను కలిసి అందుకు సంబంధించిన చెక్‌ను అందించారు.
ఈ సందర్భంగా పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) మాట్లాడుతూ.. ‘తెలుగు చిత్ర పరిశ్రమలో వెహికల్స్‌తో ఎలాంటి డేర్ డెవిల్స్ స్టంట్స్ చేయాలన్నా అది బద్రిగారికే సాధ్యం. నేను నటుడిగా శిక్షణ పొందుతున్న దగ్గరి నుంచి ఆయన నాకు పరిచయం. ‘భోళా శంకర్’లో కారుతో ఓ స్టంట్ చేసినందుకు అందుకున్న రూ.50వేల పారితోషికాన్ని జనసేన పార్టీకి విరాళంగా ఇచ్చారు. మనస్ఫూర్తిగా ఆయనికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా’ అని అన్నారు.