‘Leo’ – ఆడియో ఫంక్షన్ క్యాన్సిల్..

లోకేశ్ కనగరాజ్ (Lokesh KanagaRaj) దర్శకత్వంలో విజయ్ (Vijay) హీరోగా తెరకెక్కిన చిత్రం ‘లియో’ (Leo). ఈ చిత్రం అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే కొన్ని రోజుల నుంచి దీని ఆడియో లాంచ్ ఈవెంట్‌పై అభిమానుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. తాజాగా దీనిపై నిర్మాణసంస్థ క్లారిటీ ఇచ్చింది. ఆడియో ఫంక్షన్ నిర్వహించడం లేదని స్పష్టం చేసింది.
‘‘ఈ చిత్రం ఆడియో ఈవెంట్‌కు భారీగా అభిమానులు వచ్చే అవకాశముంది. అంతమందికి ఎంట్రీ పాస్‌లు ఇవ్వాలంటే కుదరదు. అందుకే భద్రతా కారణాలతో ఆడియో రిలీజ్ ఈవెంట్‌ను రద్దు చేయాలని నిర్ణయించుకున్నాం. అభిమానుల కోసం నిరంతరం ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్‌లను ఇస్తూనే ఉంటాం. అయితే, అందరూ భావిస్తున్నట్లు మా మీద ఏ రాజకీయ పార్టీ ఒత్తడి లేదు. మరే ఇతర కారణాలు లేవు’’ అని ట్వీట్ చేసింది. దీంతో విజయ్ ఫ్యాన్స్ నిరుత్సాహపడుతున్నారు. ‘విజయ్ స్పీచ్‌ను మేము మిస్ అవుతున్నాం’ అని కామెంట్లు పెడుతున్నారు. అయితే, మొదట ఈ ఈవెంట్‌ను సెప్టెంబర్ 30న నిర్వహించాలని అనుకున్న విషయం తెలిసిందే.