Gas station – వద్ద భారీ పేలుడు.

నాగర్నో-కారాబఖ్ ప్రాంతంలో ఆర్మేనియా సైనిక దళాలపై అజర్‌బైజాన్ (Nagorno Karabakh conflict) దళాలు దాడులకు తెగబడుతోన్న విషయం తెలిసిందే. దీంతో ఆ ప్రాంత పౌరులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఓ గ్యాస్‌స్టేషన్ వద్ద భారీ పేలుడు (Gas Station explosion) సంభవించింది. ఈ ఘనటలో 20 మంది ప్రాణాలు కోల్పోగా.. 300 మంది తీవ్ర గాయాలపాలైనట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. వీరికి స్థానిక ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. ఇందులో చాలా మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
నాగోర్నో-కరాబాఖ్ వివాదాస్పద ప్రాంతం విషయంలో అజర్‌బైజాన్-ఆర్మేనియా మధ్య మరోసారి ఘర్షణ తలెత్తింది. దీంతో అక్కడి ఆర్మేనియా సైనిక దళాలపై అజర్ బైజాన్ దళాలు దాడులు మొదలుపెట్టింది. దీంతో ఆ ప్రాంతంలోని వేల మంది తమ వాహనాల్లో ఆర్మేనియాకు బయలుదేరారు. రహదారులపై భారీగా రద్దీ ఏర్పడింది. ఈ క్రమంలో ఓ గ్యాస్ స్టేషన్ వద్ద ఇంధనం కోసం వాహనాలు క్యూ కట్టాయి. అదే సమయంలో అక్కడ భారీ పేలుడు సంభవించడంతో వందల మంది తీవ్రంగా గాయపడ్డారు.
నాగర్నో-కారాబఖ్ ప్రాంతం నుంచి ఇప్పటికే ఆరు, ఏడు వేల మంది తమ ప్రాంతంలోకి ఆర్మేనియా ప్రభుత్వవర్గాలు తెలిపాయి. మరోవైపు ఇక్కడి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వందల మంది శాంతి పరిరక్షకులతో స్థానికంగా సహాయ క్యాంపులు ఏర్పాటు చేశామని రష్యా వెల్లడించింది.