#National News

Attack by unknown persons – ఆర్మీ జవాన్‌పై గుర్తు తెలియని వ్యక్తుల దాడి

కేరళలో దారుణం చోటు చేసుకుంది. ఓ ఆర్మీ జవాన్‌ (Indian Army) పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేరళలోని (kerala) కడక్కల్ (Kadakkal) కు చెందిని షైన్‌ కుమార్‌ అనే ఆర్మీ జవాన్‌. ఆయన ఇంటి సమీపంలోని అడవిలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు అతడిపై ఆదివారం రాత్రి దాడి చేశారు. ఆ దుండుగులు అతడి చేతులను టేప్‌తో కట్టేసి, వీపు వెనుక భాగంలో పీఎఫ్ఐ అని రాశారు. అందుకు వారు గ్రీన్‌ కలర్  పెయింట్ ను ఉపయోగించినట్లు పోలీసులు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుల కోసం వెతికే అన్వేషణలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (PFI) ఇస్లామిక అతివాద సంస్థల్లో ఒకటి. ఇస్లామిక్‌ అతివాద సంస్థ పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ), దాని అనుబంధ సంస్థలపై  గతేడాది సెప్టెంబరులో కేంద్ర ప్రభుత్వం ఐదేళ్ల పాటు నిషేధం విధించిన విషయం తెలిసిందే.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *