#International news

Russia – రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ మాట్లాడుతూ, మాస్కోపై పాశ్చాత్య శక్తులు నేరుగా యుద్ధంలోకి ప్రవేశించాయి.

పశ్చిమ దేశాల శక్తులు ఉక్రెయిన్‌కు మద్దతు ఇస్తూ నేరుగా మాస్కోపై యుద్ధంలోకి అడుగుపెట్టాయని రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లవ్రోవ్‌ పేర్కొన్నారు. ఐరాస కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘అమెరికాయే నేరుగా మాతో పోరాటం చేస్తోంది. చేతులు, శరీరం మాత్రమే ఉక్రెయిన్‌వి. మనం దీనిని హైబ్రిడ్‌ యుద్ధతంత్రం అని అనుకోవచ్చు. కానీ, అది పరిస్థితులను మార్చలేదు. ఉక్రెయిన్‌ను వాడుకొని పరోక్షంగా యుద్ధం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నవారందరూ జాగ్రత్తగా పరిశీలిస్తే.. ఆయుధాలను విచ్చలవిడిగా సరఫరా చేసి అమెరికన్లు, బ్రిటిషర్లు, ఇతరులు ఇక్కడ పోరాడుతున్న విషయం అర్థమైపోతుంది’’ అని లవ్రోవ్‌ తెలిపారు. ఐరాస భద్రతా మండలిని కూడా విస్తరించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆసియా, ఆఫ్రికా దేశాలకు ప్రాతినిధ్యం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు ఉక్రెయిన్‌పై ఆదివారం రష్యా చేసిన వైమానిక దాడుల్లో ఖేర్సన్‌లో ఇద్దరు పౌరులు మృతి చెందారు. ముగ్గురు గాయపడ్డారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *