women of all categories-అన్ని వర్గాల మహిళలకు 33% కోటా కల్పించాలి

సమాఖ్య ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టిన 33శాతం మహిళా రిజర్వేషన్ బిల్లులో మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు కోటా కల్పించాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వసంత సత్యనారాయణపిళ్లై కోరారు. గురువారం సూర్యాపేటలోని జ్యోతిరావు ఫూలే విగ్రహం దగ్గర మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతుగా తెలంగాణ బీసీ మహిళా సంక్షేమ సంఘం జిల్లా విభాగం ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. ఎట్టకేలకు 26 ఏళ్ల తర్వాత మహిళా బిల్లును లోక్సభ ప్రవేశపెట్టి ఆమోదించిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బుద్దా సత్యనారాయణ, చామకూరి నరసయ్య, పద్మ, వెంకటమ్మ, నిర్మల, సైదమ్మ, నాగమ్మ, అనసూయతో పాటు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రతినిధి కంచుకొమ్ముల వెంకట్ తదితరులు పాల్గొన్నారు.