Students should-విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలి

హన్మకొండ అర్బన్: విద్యార్థినీ విద్యార్థులు ఏకాగ్రతతో తరగతిలో ముందుకు సాగాలని కలెక్టర్ సిక్తాపట్నాయక్ సూచించారు. వడ్డేపల్లిలోని పింగిళి ప్రభుత్వ మహిళా కళాశాలలో డిగ్రీ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఓరియంటేషన్ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పింగ్లీ కళాశాలలో విద్యార్థినులకు కావాల్సిన అన్ని వనరులు ఉన్నాయని, ఈ సౌకర్యాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో బోధకులు, విద్యార్థులు, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జి. సుహాసిని, అకడమిక్ కోఆర్డినేటర్ డి.పార్వతి, పరీక్షల నియంత్రణాధికారి డి.రామకృష్ణారెడ్డి, ప్రిన్సిపాల్ చంద్రమౌళి పాల్గొన్నారు.