bank-dupity-manager-చేతివాటం.. రూ.8.65 కోట్ల బురిడీ

వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని ఐసీఐసీఐ బ్యాంకు డిప్యూటీ మేనేజర్ బైరిశెట్టి కార్తీక్ చేతివాటం ప్రదర్శించాడు. తాను పని చేస్తున్న బ్యాంకునే బురిడీ కొట్టించి.. రూ.8,65,78,000 కొల్లగొట్టాడు. వివరాల్లోకి వెళ్తే… బ్యాంకులోని బంగారు రుణాల విభాగంలో కార్తీక్ పని చేస్తున్నాడు. ఖాతాదారులు బంగారు రుణాలు పొందినట్లు రికార్డులు సృష్టించి ఆ సొమ్మును తాను అపహరించేవాడు. ఇలా 128 మంది ఖాతాదారులు రుణాలు పొందినట్లు రికార్డులు సృష్టించాడు. ఆడిటింగ్ సమయంలో మోసాన్ని గుర్తించిన అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బందులు లేవని పోలీసులు తెలిపారు. కొల్లగొట్టిన సొమ్మును క్రికెట్ బెట్టింగ్లో పోగొట్టుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి… అతడిని రిమాండ్కు తరలించారు.