Bharat, a B.Tech student from Thirmanpally died of dengue – తిర్మన్‌పల్లికి చెందిన భరత్ అనే బీటెక్ విద్యార్థి డెంగ్యూతో మృతి చెందాడు

డెంగీ కేసులు జి ల్లాలో క్రమంగా పెరుగుతున్నాయి. ఇందల్‌వాయి మండలం తిర్మన్‌పల్లికి చెందిన బీటెక్ విద్యార్థి భరత్ డెంగీతో బుధవారం మృతి చెందాడు. జ్వరం రావడంతో ఇంటివద్ద మందులు వాడినా తగ్గకపోవడంతో మూడు రోజుల క్రితం జిల్లా కేంద్రంలోని ఓ ప్రముఖ ప్రైవేట్ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రిలో చేరాడు. మంగళవారం విద్యార్థి పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు హైద్రాబాద్‌లోని నిమ్స్‌కు తలించగా చికిత్స పొదు తూ మృతి చెందాడు.
జిల్లాలో డెంగీ జ్వరంతో నెలలో ఒకరిద్దరు మరణిస్తున్నారు. రెండు నెలల్లో 120 వరకు డెంగీ కేసులు నమో దు అయ్యాయి. ప్రైవేట్ ఆస్పత్రులకు నిత్యం పదుల సంఖ్యలో డెంగీ బాధితులు వస్తున్నా అధికారికంగా నమోదు కావడం లేదు. కాగా ప్రభుత్వ ఆస్పత్రిలో జూలై, ఆగష్టు నెలలో ఒక్కొక్కరి చొప్పున డెంగీతో మరణించినట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. డెంగీతో భరత్ మృతి అధికారులకు సమాచారం లేదు.