#ట్రెండింగ్ న్యూస్

Kalvakuntla firey comments on ED Notices – ఈడి నోటీసు లు గురించి విరుచుకుపడ్డ కల్వకుంట్ల కవిత

 నిజామాబాద్: రాజకీయ కక్షతోనే తనకు నోటీసులు పంపారని.. లిక్కర్‌ స్కాం కేసులో ఈడీ నోటీసుల పరిణామంపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, బీజేపీపై ఆరోపణలు గుప్పించారు. నోటీసులు అందించిన విషయాన్ని ఇవాళ నిజామాబాద్‌లో ప్రెస్‌మీట్‌ నిర్వహించి ధృవీకరించారామె. ఈ క్రమంలో ఈడీ నోటీసులపై సెటైర్లు సంధించారు.

నోటీసులు అందాయి. ఇది రాజకీయ ప్రేరేపిత చర్య అని ముందు నుంచి చెబుతున్నాం. మళ్లీ రాజకీయం కోసమే పంపారు. ఇవి ఈడీ నోటీసులు కాదు.. మోదీ నోటీసులు. తెలంగాణలో నెలకొన్ని రాజకీయ వాతావరణం, ఎన్నికల నేపథ్యంలోనే ఇప్పుడు మళ్లీ నోటీసులు పంపారు. తెలంగాణ ప్రజలు ఈ నోటీసులను సీరియస్‌గా తీసుకోవడం లేదు.

అయితే బాధ్యత గల ప్రజాప్రతినిధిగా.. ఈ విషయాన్ని మా లీగల్‌ టీంకు చెప్పాం. వాళ్లు ఇచ్చే సలహాను బట్టి ముందుకు సాగుతాం. ఏడాది నుంచి కంటిన్యూగా నోటీసు లు వస్తున్నాయి..  ఇదంతా టీవీ సీరియల్ లాగా సాగుతోంది అని తెలిపారామె. 

తాము ఎవరితోనూ పొత్తులు పెట్టుకోమని.. తాము బీజేపీకో, కాంగ్రెస్‌కో B టీమ్ కాదని.. దేశవ్యాప్తంగా కేసీఆర్‌ పార్టీకి దక్కుతున్న స్పందనకు ఆ రెండు జాతీయ పార్టీలు భయపడుతున్నాయని, అందుకే అర్థంపర్థం లేని ఆరోపణలు చేస్తున్నాయని ఆమె తెలిపారు. తాము దేశ ప్రజల తరపున ఏ టీం అని తెలిపారామె. 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *