Minister Koppula – మంత్రి కొప్పుల కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం అని అన్నారు

జగిత్యాల : బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ధర్మపురి నియోజకవర్గం ఎండపల్లి మండలం చర్లపల్లి గ్రామానికి చెందిన పొన్నం గంగాధర్ గౌడ్ 2023 మే నెలలో రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. కాగా, అతడికి బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఉండటంతో రెండు లక్షల ప్రమాద బీమా మంజూరైంది. ఈ మేరకు 2 లక్షల రూపాయల చెక్కును గంగాధర్ భార్య జమునకు మంత్రి అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వం కలిగి ఉన్న ప్రతి కార్యకర్తకు ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించిందన్నారు. పార్టీ కార్యకర్తలు ప్రమాదవశాత్తు చనిపోతే వారి కుటుంబ సభ్యులకు అండగా నిలిచేందుకు ఈ ప్రమాద బీమా ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ పార్టీలో పనిచేసే ప్రతి కార్యకర్త కుటుంబానికి అండగా ఉండేందుకే ఈ బీమా సదుపాయం కల్పించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సింహాచలం జగన్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పడిదం మొగిలి, ఎండీ రియాజ్, జిల్లా లేబర్ బోర్డు కమిటీ మెంబర్ సిగిరి ఆనంద్, యూత్ ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి రాజు, ఉప సర్పంచ్ అలగం తిరుపతి, బట్టు రామస్వామి, కాటు రావి, గ్రామ శాఖ అధ్యక్షుడు శ్రవణ్, పడిదం వెంకటేష్ పాల్గొన్నారు.